Gold rates : తగ్గిన బంగారం, వెండి ధరలు… మార్కెట్లో కొత్త రేట్లు ఇవే

-

Gold Rates : బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on oct 5th
gold and silver rates on oct 5th

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 57, 370 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 52, 590 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 400 తగ్గిపోయి రూ. 73, 100 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news