నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

-

జిల్లాల్లో సుడిగాలి పర్యటనలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. 900 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్‌ చేరుకుని… లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్పాహార కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

అనంతరం కాజీపేటలోని బంధం చెరువు వద్ద మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటుతో పాటు…. రూ.90 కోట్లతో నిర్మించనున్న నూతన బస్టాండ్ కోసం భూమి పూజ చేస్తారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ప్రారంభించి మడికొండలో ఐటి పార్కుకు శంకుస్థాపన చేస్తారు. గృహలక్ష్మి, దళిత బంధు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారు. పోతననగర్‌లో ఆధునిక దోబీ ఘాట్‌, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సెంటర్‌ ప్రారంభించిన అనంతరం…. హనుమకొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొంటారు. బీఆర్ఎస్ శ్రేణులకు…. వచ్చే ఎన్నికల్లో ఆచరించాల్సిన ఎత్తుగడలతో పాటు… దిశానిర్దేశం చేస్తారు. కేటీఆర్‌ పర్యటన దృష్ట్యా ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news