తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేయనున్నారు కేసీఆర్. నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
సీఎం కేసీఆర్ నవంబర్ 09న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ ధాఖలు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు 15న హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 16న జనగామ, భువనగిరి బహిరంగ సభల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈనెల 17న సిద్దిపేట, సిరిసిల్ల బహిరంగ సభలకు హాజరు కానున్నారు. 18న జడ్చర్ల, మేడ్చల్ లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించినున్నారు. కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సిద్దమే అన్నట్టుగా దాదాపు నెల రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ముందంజలో ఉందనే చెప్పాలి.