ఎలాంటి జుట్టు సమస్యకు ఎలాంటి ఆయిల్‌ వాడాలి..? అన్నింటికి ఒకటే వాడితే నో యూస్‌

-

ఒక వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉన్నారో వారి జుట్టును చూసే చెప్పేయొచ్చు. ఎందుకంటే.. ఎప్పుడూ జుట్టు రాలిపోతూ, పలచుగా ఉందంటే.. వాళ్లు సరైన ఆహారం తీసుకోవడం లేదని అర్థం. కొంతమంది మంచి ఆహారం తీసుకున్నప్పటికీ వారికి మెయింటేనెన్స్‌ సరిగ్గా ఉండదు. జుట్టుకు ఆయిల్ పెట్టడం కూడా ఒక ఆర్ట్ తెలుసా..? ఆయిల్‌ పెట్టి మసాజ్‌ చేయడంతోనే సగం జుట్టు సమస్యలు పోతాయి. ఏ ఆయిల్‌ను వాడుతున్నాం అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. రసాయనాలతో కూడిన హెయిర్‌ ఆయిల్‌ వాడటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గించుకోవాలంటే.. ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన నూనెను ప్రతి రోజు వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటంటే..

లావెండర్ నూనె:

లావెండర్ నూనెలో యాంటీ-మైక్రోబయల్ ఎలిమెంట్స్ అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను అప్లై చేసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. దీంతో పాటు శిరోజాలు కూడా దృఢంగా మారుతాయి. అంతేకాకుండా జుట్టు రక్తప్రసరణ మెరుపడి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కలబంద నూనె:

ఈ నూనె ఆయుర్వేద స్టోర్స్‌లో లభిస్తుంది. దీనిని వినియోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. తలకు పోషణను అందించేందుకు ఈ ఆయిల్‌ బాగా పనిచేస్తుంది. జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను వినియోగించడం వల్ల హెయిర్‌ ఫాల్‌ను కంట్రోల్‌ చేయోచ్చు.

జిన్సెంగ్ నూనె:

జిన్సెంగ్ నూనెలో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. దీనిని ప్రతి రోజు వినియోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నూనెను తలకు అప్లై చేయడం వల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. హార్మోన్ల కారణంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను అప్లై చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

రోజ్మేరీ నూనె:

రోజ్మేరీ నూనె కూడా జుట్టును ఆరోగ్యం చేసేందుకు కీలక పాత పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. తెల్ల జుట్టు సులభంగా నల్లగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను వినియోగించండి.

Read more RELATED
Recommended to you

Latest news