తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంలోని వలసపాకలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.2 కోసం జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వలసపాకలో ఓ సైకిల్ షాపులో సువర్ణరాజు అనే యువకుడు గాలి కొట్టించుకున్నాడు. అనంతరం రెండు రూపాయల కోసం షాపు యజమాని సాంబతో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా సాంబపై చేయిచేసుకున్నాడు. ఈ సమయంలో సాంబ పక్కనే ఉన్న అతని స్నేహితుడు అప్పారావు ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఈ క్రమంలోనే అక్కడున్న కత్తితో సువర్ణరాజును పొడిచాడు. దీంతో సువర్ణరాజు అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతని ఆస్పత్రికి తరలించగా.. ప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.