వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం – విజయశాంతి

-

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం అంటూ బీజేపీ పార్టీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రీ పోల్ సర్వేలు, రానున్న అసెంబ్లీ ఎన్నికలల్ల బీఆర్ఎస్ గెలుపునకు దూరమవుతున్నట్లు తెలియచేస్తున్నవి అంటూ పేర్కొన్నారు విజయశాంతి.

vijayashanthi on cm kcr over nda
vijayashanthi on cm kcr over nda

దోపిడీ, దుర్మార్గం, అవినీతి, నియంతృత్వంతో నడుస్తున్న ఈ కేసీఆర్ గారి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలోని ఈ మార్పు తప్పక అభినందనీయం అన్నారు. నేను నా తోటి తెలంగాణ ఉద్యమకారులం సంవత్సరాలుగా చెబుతున్న వాస్తవాలు, మా ప్రజల ఆలోచనకు, అవగాహనకు చేరుతున్నట్లు ఇప్పుడిప్పుడే అన్పిస్తున్నదంటూ పోస్ట్‌ పెట్టారు విజయశాంతి.

కొన్ని ఛానెల్స్ ల చెబుతున్నట్లు నేడు బీజేపీ ప్రకటించిన కమిటీల‌ బాధ్యతలకు మేము కొందరం పార్టీకి తెలియజేసిన అంశాలకు సంబంధం లేదన్నారు విజయ శాంతి. వేరు వేరు విషయాలను, వేరైన సమస్యలను ఒక్కటిగా కలిపి చూడమని ఎవ్వరం అనలేమని విజయ శాంతి వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news