బతుకమ్మ పండుగ వెనుక ఉన్న కధ ఇదే..!

-

ఆశ్వీజమాసంలో బతుకమ్మ పండుగ వస్తుంది. తెలంగాణలో ఆడపడుచులు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమావాస్య తరువాత రోజు నుండి బతుకమ్మ పండుగ మొదలవుతుంది తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుతారు.

బతుకమ్మ పండుగకు సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ…. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే కధ ఇదే. ఇక దాని గురించి తెలుసుకుందాం. భూస్వాముల అకృత్యాలను భరించ లేక ఆత్మహత్య చేసుకుంది ఒక బాలిక. అయితే ఆ ఊళ్ళో ప్రజలు ఆమెని కలకాలం బతుకమ్మా అని దీవించారు. అప్పటి నుండి కూడా బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజించడం మొదలు పెట్టారు. ఇలా స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ వెలుగులోకి వచ్చింది. స్త్రీలు వాళ్ళ భర్తకి, పిల్లలకి ఏ ఇబ్బంది రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు.

మరొక కధ ఏమిటంటే దక్షిణ భారత దేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడుకి సంతానం లేదు. అందుకు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతురికి జన్మనిచ్చింది. లక్ష్మి అనే పేరు పెట్టాడు. లక్ష్మి అనేక గండములను ఎదుర్కోగా.. బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి నుండి యువతులు మంచి భర్తను వివాహం చేసుకోవాలని కోరుతూ వున్నారు. ఇలా బతుకమ్మ ఆనవాయితీ అయిందట.

అమావాస్య తరువాత రోజు నుండి బతుకమ్మ పండుగ మొదలవుతుంది తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుతారు. ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజుల్లో కూడా ఒక్కో రకమైన ఆహారపదార్థాలతో నైవేద్యం పెడతారు తొమ్మిది రోజులు కూడా రోజుకు ఒక రూపంలో బతుకమ్మని కొలుస్తారు. అయితే మరి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ఎలా జరుపుతారు..? వేటిని నైవేద్యం కింద సమర్పిస్తారు అనే వాటి గురించి చూద్దాం.

ఎంగిలి పూల బతుకమ్మ :

మొదట రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఈరోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం పెడతారు.

అటుకుల బతుకమ్మ :

రెండో రోజు అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులని తల్లిక్కి నైవేద్యంగా పెడతారు.

ముద్దపప్పు బతుకమ్మ :

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను పెడతారు. ఆరోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నివేదిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ:

నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మకి పూజలు చేస్తారు. నైవేద్యంగా నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి పెడతారు.

అట్ల బతుకమ్మ :

ఐదవ రోజు అట్ల బతుకమ్మను పెట్టి అట్లును నైవేద్యంగా సమర్పిస్తారు.

అలిగిన బతుకమ్మ:

ఈ రోజు నైవేద్యం పెట్టరు.

వేపకాయల బతుకమ్మ:

ఏడవ రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా చేసి నైవేద్యంగా పెడతారు.

వెన్నముద్దల బతుకమ్మ :

ఈరోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం పెడతారు.

సద్దుల బతుకమ్మ:

పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదు రకాలను నైవేద్యంగా పెట్టాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news