ముళ్ల పొదల్లో లభ్యమైన ఏడు రోజుల పసికందు..!

-

ఈ మధ్య కాలంలో రోజు రోజుకు పసి పిల్లల హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముక్కుపచ్చలారని పసిపాపలను గాలికి వదిలేస్తున్నారు. ఆ కన్నతల్లులకు ఎలా ప్రాణం దరిస్తుందో మరీ. తాజాగా ఓ తల్లి పేగు బంధాన్ని మరచి కన్న పెగునే గాలికి వదిలేసిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ముళ్లపదల్లో ఏడు రోజుల పసికందును పోలీసులు బుధవారం గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమవారం గ్రామానికి చెందిన రమేష్ దంపతులు ద్విచక్ర వాహనంపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ సర్వీసు రోడ్డు మీదుగా హయత్ నగర్ వైపు వెళుతున్నారు. మార్గమధ్యంలో జెకె కన్వెన్షన్ హాల్ వద్ద కొద్దిసేపు ఆగారు. అదే సమయంలో పక్కన ఉన్న ముళ్లపదల్లో నుంచి ఏడుపు వినిపించడంతో పరిశీలించారు అక్కడ పసికందు ఏడుస్తున్నట్టు గుర్తించిన దంపతులు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు.

ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్సై రాము సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని కవర్లో చుట్టి ఉంచిన శిశువును ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ శిశువుకు ప్రాథమిక చికిత్స అందించారు డాక్టర్లు. పసికందు జన్మించి ఏడు రోజులు మాత్రమే అవుతుందని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతము శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా నే ఉందని వైద్యులు వెల్లడించారు. చికిత్స తర్వాత ఆడ శిశువును శిశు సంక్షేమ కమిటీకి పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news