బిహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి

-

ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని రైలును ఆశ్రయించే ప్రయాణికులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం వందల మంది ప్రాణాలను బలితీసుకున్న ఘటన మరవకముందే.. తాజాగా బిహార్​లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.

బిహార్​లోని బక్సర్​లో నార్త్​ఈస్ట్​​ సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​(రైలు నెం-12506)కు ఘోర ప్రమాదం జరిగింది.​ 21 బోగీలు పట్టాలు తప్పడంతో నలుగురు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బక్సర్‌ జిల్లాలోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో రాత్రి 10.30 గం. సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడారు. గాయపడిన వారిని బ్రహ్మపూర్ ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సాంకేతిక లోపంతో జరిగిందా లేదా ఎవరైనా కావాలనే కుట్ర పన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news