అన్​స్టాపబుల్-3 ఫస్ట్ ఎపిసోడ్​లో..​ ‘భగవంత్ కేసరి’ మూవీటీమ్

-

నందమూరి బాలకృష్ణ.. ఆరు పదుల వయసులోనూ ఈ హీరో జోరు తగ్గడం లేదు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో థియేటర్లలో మోత మోగిస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి బాలయ్య పట్టినదంతా బంగారమే అవుతున్నట్లు.. ఈ హీరో తీస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో జోష్ మీదున్న బాలయ్య ఇప్పుడు దసరాకు భగవంత్ కేసరిగా ముందుకు రాబోతున్నాడు.

మరోవైపు బుల్లితెరపైనా తన అన్​స్టాపబుల్ షోతో రచ్చ చేయబోతున్నాడు బాలయ్య. అక్టోబర్ 17వ తేదీన ఈ షో సీజన్-3 షురూ కాబోతోంది. అయితే ఈ సీజన్ తొలి ఎపిసోడ్ భగవంత్ కేసరి చిత్రబృందంతో ప్రారంభం కాబోతోంది. ఈ ఎపిసోడ్​లో అయితే బాలయ్య కొత్త చిత్రం ‘భగవంత్ కేసరి’ టీమ్​ సభ్యులు గెస్ట్​లుగా హాజరయ్యారని​ ఆహా తెలిపింది. ఈ మేరకు ‘మరో సెన్సేషన్​కు అంతా రెడీ. అన్​స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రారంభం అవుతోంది ‘ అని ట్విటర్​లో రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్​ కానున్నట్లు ఆహా తెలిపింది. ఈ ఎపిసోడ్​లో హీరోయిన్లు కాజల్, శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు మరికొంత మంది నటులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news