తీరం దాటిన బుల్‌ బుల్‌ తుఫాన్.. కానీ..

-

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్బుల్ తుఫాన్ తీరం దాటింది. కానీ.. తీరం దాటిన తర్వాత తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. సుంరదబన్ డెల్టా మీదుగా బంగ్లాదేశ్ వైపుగా తుఫాన్ బలహీనపడుతోంది. పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ద్వీపం దగ్గర బుల్ బుల్ తుఫాన్ తీరం దాటింది. ఈ ప్రభావంతో బెంగాల్‌లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ముగ్గురు మృతి చెందారు. కాగా.. ఈ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని.. సహాయక చర్యల కోసం నౌకలు, హెలికాఫ్టర్లను సిద్ధం చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news