మహారాష్ట్రలో బిజెపి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని బిజెపి స్పష్టం చేసింది. కొర్ కమిటీ భేటీ అనంతరం గవర్నర్ భగత్ సింగ్ కొష్యారిని కలిసి తమకు సంఖ్యా బలం లేదని ఫడ్నవీస్ వివరించారు. ఇక ఈ సందర్భంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు శివసేన మరాఠీ ప్రజలను అవమానించిందని వ్యాఖ్యానించారు. కావాలంటే శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని ఫడ్నవీస్ పేర్కొన్నారు. బిజెపి కొర్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంది బిజెపి. తమకు సంఖ్యా బలం లేదని గవర్నర్ ను కలిసి వివరించారు.
దీనితో గత రెండు వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు బీజేపీ తెర దించినట్లు అయింది. ముఖ్యంగా శివసేన ముఖ్యమంత్రి పదవి విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో బీజేపి ఈ నిర్ణయం తీసుకుంది. ముందు అనుకున్న విధంగా ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని శివసేన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు శివసేన నేతలు కూడా తమ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు బిజెపికి సాధ్యం కాలేదు. ముందు నుంచి తమ ఎమ్మెల్యేలను బిజెపి వలలో పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో శివసేన వ్యవహరించింది.