గ‌రుడ పురాణం ప్ర‌కారం అత్యాచారాల‌కు ఏ శిక్ష‌లు విధిస్తారో తెలుసా..?

-

అత్యాచారాలు, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే కామాంధుల‌కు మన దేశంలో త‌గిన శిక్ష‌లు విధించ‌క‌పోవ‌చ్చు. కానీ గ‌రుడ పురాణం ప్ర‌కారం.. అలాంటి కామాంధుల‌కు న‌ర‌కంలో దారుణ‌మైన శిక్ష‌లు ఉంటాయి.

దేశంలో రోజు రోజుకీ మాన‌వ మృగాల సంఖ్య పెరిగిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా మ‌హిళ‌ల‌పై ప‌డి త‌మ ప‌శువాంఛ‌ను తీర్చుకుంటున్నారు. కామంతో క‌ళ్లు మూసుకుపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వారికి వావి వ‌రుస‌, చిన్న‌, పెద్ద‌, ఆడ‌, మ‌గ అన్న తేడాలుండ‌వు. కామ‌వాంఛ తీర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యం. అందుకు ఏం చేయ‌డానికైనా వెనుకాడడం లేదు. వారి చేతిలో అభం శుభం తెలియని ప‌సికందులు కూడా బ‌ల‌వుతున్నారు. ఎంతో క‌ఠిన‌మైన చ‌ట్టాల‌ను తెచ్చామ‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్న‌ప్ప‌టికీ.. అవేవీ ఆ రాక్ష‌సుల‌ను భ‌య పెట్ట‌డం లేదు. ఫ‌లితంగా దేశంలో రోజు రోజుకీ అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయే త‌ప్ప త‌గ్గ‌డం లేదు.

అయితే అత్యాచారాలు, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే కామాంధుల‌కు మన దేశంలో త‌గిన శిక్ష‌లు విధించ‌క‌పోవ‌చ్చు. కానీ గ‌రుడ పురాణం ప్ర‌కారం.. అలాంటి కామాంధుల‌కు న‌ర‌కంలో దారుణ‌మైన శిక్ష‌లు ఉంటాయి. అవేమిటంటే…

1. పుయోద‌కం

పురుషులు లేదా మ‌హిళ‌లు ఎవ‌రైనా స‌రే.. ఎవ‌ర్న‌యినా అత్యాచారం చేసినా, లైంగిక వేధింపుల‌కు గురి చేసినా న‌ర‌కంలో ఈ శిక్ష విధిస్తారు. ఒక పెద్ద బావిలో మ‌లం, మూత్రం, ర‌క్తం, శ్లేష్మం నింపి అందులో ఆ వ్య‌క్తుల‌ను ప‌డేస్తారు. ఇక వారు ఎప్ప‌టికీ ఆ బావిలోనే ఉంటారు. బ‌య‌ట‌కు రాలేరు.

2. స‌ల్మ‌లి

వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునే స్త్రీ, పురుషుల‌కు న‌ర‌కంలో య‌మ భ‌టులు ఈ శిక్ష విధిస్తారు. బాగా వేడి చేయ‌బ‌డి ఎర్ర‌గా మారిన ఓ ఇనుప వ‌స్తువును కౌగిలించుకుని పాపులు న‌గ్నంగా నిల‌బ‌డితే.. య‌మ భ‌టులు వెనుక మొత్తం కొర‌డాల‌తో కొడుతూ శ‌రీరాన్ని ప‌చ్చ‌డి ప‌చ్చ‌డి చేస్తారు.

3. వ‌జ్ర‌కంఠక‌స‌లి

జంతువులతో శృంగారం చేసే వ్య‌క్తుల‌కు న‌ర‌కంలో య‌ముడు ఈ శిక్ష విధిస్తాడు. సూదుల వంటి పెద్ద పెద్ద లోహ‌పు వ‌స్తువుల‌కు క‌ట్టేసి ఈ పాపుల శ‌రీరాల‌ను ఛిద్రం చేస్తారు.

4. ల‌లాభక్షం

స్త్రీల‌ను కామంతో చూసే వారికి న‌ర‌కంలో ఈ శిక్ష విధిస్తారు. కుళ్లిపోయిన వీర్యంతో నిండిన స‌ముద్రంలో పాపుల‌ను ప‌డేసి ఎప్ప‌టికీ అందులోనే ఉంచుతారు.

Read more RELATED
Recommended to you

Latest news