ఇండియా రేపు వరల్డ్ కప్ లో మూడవ మ్యాచ్ ఆడనుంది. వరుసగా ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ జట్లపై గెలిచి మంది ఊపుమీదుండగా, మరోవైపు ప్రత్యర్థి పాకిస్తాన్ గత మ్యాచ్ లో శ్రీలంకపై 345 పరుగులు ఛేదించి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ఇండియాను ఓడించడానికి సన్నద్ధం అవుతోంది. కాగా కాసేపటి క్రితమే రేపు మ్యాచ్ కు సంబంధించి ఒక కీలకమైన విషయం బయటకు వచ్చింది. వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుండి రెండు మ్యాచ్ లు పూర్తి చేసుకున్న ఇండియా గిల్ ను ఆడించడం కుదరలేదు, డెంగ్యూ కారణంగా విశ్రాంతిలో ఉన్నాడు. కానీ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రేపటి మ్యాచ్ కు గిల్ సిద్ధంగా ఉంటాడని తెలుస్తోంది. డెంగ్యూ నుండి కోలుకుని 99 శాతం వరకు అందుబాటులో ఉంటాడని ధీమాను ఇచ్చాడు.
దీనిని బట్టి గిల్ ఆడుతాడా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు. ఒకవేళ గిల్ మ్యాచ్ లో ఆడితే ఇషాన్ కిషన్ ను తొలగించక తప్పేలా లేదు.. లేదా శ్రేయాస్ అయ్యర్ ను తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.