కల్వకుంట్ల కవితకు బీఫామ్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్..!

-

తొలి జాబితాలో 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 114 మందిలో 63 మంది అభ్యర్థులకు ఇంకా  బీఫామ్‌లను అందించలేదు. నిన్న పెత్తరమవాస్య కావడంతో మంచి రోజు కాదని సంతకాలు చేయలేదు.. మిగతా వారికి రెండు, మూడు రోజుల్లో సంకతాలు చేసి బీఫామ్ లను అందజేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.  కేవలం  51 మందికే ఈరోజు బీఫామ్‌లు ఇచ్చారు సీఎం కేసీఆర్.

ప్రశాంత్ రెడ్డి బీఫామ్‌ను కల్వకుంట్ల  కవితకు అందజేశారు సీఎం కేసీఆర్. ప్రశాంత్  తల్లి చనిపోవడంతో ఇవాళ పార్టీ మీటింట్‌కు హాజరు కాలేదు ప్రశాంత్ రెడ్డి. దీంతో కవిత బీ ఫామ్ అందుకుంది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన బీ ఫామ్ ను గంప గోవర్దన్ తీసుకున్నారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని.. హైరానా పడకండి. ముందుగానే బీ ఫామ్ ఇస్తున్నాం.జాగ్రత్తగా బీ ఫామ్స్ నింపండి. చివరి రోజు వరకు సమయం ఉందని ఆగమాగం అవకండి. చివరి రోజే అందరూ వేయాలని ఇబ్బంది పడకండి. బీ ఫామ్స్ తప్పుగా నింపకండని సూచించారు సీఎం కేసీఆర్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని.. శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తో పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారు. అలాంటి అజాగ్రత్తగా అస్సలు ఉండకండని తెలిపారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news