ఇప్పుడు మార్కెట్లో కొన్ని వేల రకాల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందులోంచి మనకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవడం కాస్త కష్టమైన పనే. ముందుగా మనం కొత్త ఫోన్ కొనాలంటే.. ఆ ఫోన్ కాస్ట్, ఫీచర్లు, కెమెరా క్వాలిటీ ఇవే చూస్తాం కదా..! మీ బడ్జెట్ కాస్త ఎక్కువైతే.. అందుకు తగిన ఫోన్లనే చూసుకుంటారు. ఈ మధ్య మడతపెట్టే ఫోన్ల హవా ఎక్కువైంది. సామ్సంగ్, ఒప్పోలో ఇప్పటికే ఫోల్టబుల్ ఫోన్స్ వచ్చాయి. చైనీస్ దిగ్గజం వన్‌ప్లస్ సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. వన్‌ప్లస్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ అక్టోబర్ 19న లాంచ్ కానుంది.
వన్‌ప్లస్ కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్’ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 19న ఈ ఫోన్ భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది. వన్‌ప్లస్ ఓపెన్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 19న ముంబైలో జరగనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్, కంపెనీకి సంబంధించిన సోషల్ మీడియా పేజీల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
ధర ఎంత?
వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ధర సుమారు రూ.1 లక్ష నుంచి రూ. 1.2 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. అయితే అధికారిక లాంచింగ్ తర్వాతే ఫోన్ ధర ఎంతనేది వెల్లడి కానుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ 7.8-అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.31-అంగుళాల ఔటర్ డిస్ప్లేతో రావచ్చు.
2K AMOLED ఇంటర్నల్ డిస్ప్లే, హై క్వాలిటీ అవుటర్ స్క్రీన్ ఉండవచ్చు.
స్క్రీన్ రీప్రెష్ రేటు 120Hz వరకు ఉంటుంది. ఈ డివైజ్‌లో 12GB RAM ఉంటుంది.
ఫ్లాగ్షిప్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ జెన్ 2 చిప్సెట్తో ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అందించనుంది.
ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ OS 13.1తో వస్తుంది.
100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,800mAh బ్యాటరీ ఫోన్లో ఉంటుంది.
కెమెరా క్వాలిటీ
ఈ ఫోన్ కవర్, మెయినన్ డిస్ప్లేల్లో పంచ్ హోల్ కెమెరాలు ఉంటాయి. రియర్ కెమెరా సెటప్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 64MP 3x టెలిఫోటో షూటర్ హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరాలు ఉండవచ్చు. 32MP ఎక్స్టర్నల్, 20MP ఇంటర్నల్ సెల్ఫీ కెమెరాలతో డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ఫోన్లో ఉండవచ్చు.
శామ్సంగ్, ఒప్పో కంపెనీలు ఇప్పటికే భారత్‌లో ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేశాయి. వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్, గెలాక్సీ Z ఫోల్డ్ 5తో పోటీ పడనుంది. గ్లోబల్ మార్కెట్లలో గెలాక్సీ Z ఫోల్డ్ 5 ధర $1,800 కాగా, వన్‌ప్లస్ ఓపెన్ మాత్రం సుమారు $1,700కి అందుబాటులో ఉంటుందని సమాచారం. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఈ డివైజ్ ఫస్ట్ ఆప్షన్‌గా ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందట.