రూ.400కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. కేసీఆర్ కీలక ప్రకటన

-

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. ముఖ్యంగా  కేవలం రూ.400కే సిలిండర్ అందిస్తామని  ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.  అర్హత కలిగిన వారికి ఈ బెనిఫిట్ లభించనుంది. సీఎం కేసీఆర్ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ కీలక ప్రకటన చేశారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్‌లకు కూడా రూ. 400కే సిలిండర్ లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పెన్షన్ తీసుకునే వారికి కూడా కేసీఆర్ భారీ ఊరట కల్పించారు. పెన్షన్ పెంచుతున్నట్లు వెల్లడించారు. రూ. 5 వేల వరకు పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ పెంపు విడతల వారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏటా రూ.500 పెరుగుతుందని తెలిపారు.

అలాగే కేసీఆర్ ఎన్నికల వేళ సామాన్యులపై కూడా వరాల జల్లులు కురిపించారు. వికలాంగులకు అయితే రూ.6 వేల వరకు పెన్షన్  అందిస్తామని తెలిపారు. అలాగే తెలుపు రేషన్ కార్డు ఉన్న వారికి తీపికబురు అందించారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి భీమా స్కీమ్ ప్రకటించారు. దీని వల్ల 93 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతుందని చెప్పారు. ఎల్ఐసీ  ద్వారా బీమా అమలు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వీరికి సన్న బియ్యం కూడా అందిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news