చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తాం : సీఎం కేసీఆర్ 

-

జనగామ కి మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు సీఎం కేసీఆర్.  ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. జనగా మ కరువు ప్రాంతంగా ఉండేది.. ఇప్పుడు అవన్ని మాయమైపోయి.. మెల్ల మెల్లగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్ లో ఇండస్ట్రీలతోని జనగామ డెవలప్ మెంట్ అవుతుంది.

ఎన్నికలు చాలా సందర్భాల్లో వస్తయి. ఎవ్వడో చెప్పిండని.. ఓటు వేయకూడదు. ఓటు మన తలరాతను మార్చుతుంది. రాష్ట్ర దిశ, దశను మార్చుతుంది. మన చేతిలో ఉండే బలమైన ఆయుధం ఓటు.. ఆపద మొక్కులు మొక్కేవారుంటారు. అలా కాకుండా.. మంచి, చెడును గుర్తించి మంచి వైపు నడిపిస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చినా జనగామలో మాత్రం కరువు రాదన్నారు సీఎం కేసీఆర్. జనగామలో వంద శాతం గ్రామాలకు నీళ్లు అందజేస్తానని తెలిపారు.  

 

Read more RELATED
Recommended to you

Latest news