మేకప్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. బయటకు వెళ్లాలంటే.. ఎవరికి తగ్గట్టు వాళ్లు రెడీ అవుతారు. ఈ మేకప్ కల్చర్ ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు ఇవన్నీ ఏడ ఉన్నాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ మేకప్ చరిత్ర ఇప్పటది కాదు.. 2000 ఏళ్ల క్రితం నుంచి మహిళలు మేకప్ వేసుకునేవాళ్లు తెలుసా..? ఆశ్చర్యంగా ఉందా..? నిజమండి.!
పశ్చిమ టర్కీలోని పురాతన నగరంలో ఐజానోయ్లో పురావస్తు శాస్త్రవేత్తలు 2,000 సంవత్సరాల నాటి సౌందర్య సాధనాలను కనుగొన్నారు. ఆ కాలంలోని అందాల రహస్యాలను కూడా బయటపెట్టింది.రోమన్ కాస్మెటిక్ మరియు మేకప్ దుకాణం యొక్క అవశేషాలను పరిశోధకులు కనుగొన్నారు.
BBC నివేదిక ప్రకారం, పురావస్తు శాస్త్రవేత్తలు ఆ కాలంలో ఆభరణాలు, పెర్ఫ్యూమ్, మేకప్ ఉత్పత్తుల వంటి సౌందర్య సాధనాలను విక్రయించే దుకాణాన్ని కనుగొన్నారు. వివిధ పూసలతో కూడిన గొలుసులు, హెయిర్పిన్లు కూడా వారికి అందుబాటులో ఉన్నాయి. షాపు నిండా కప్ప పెంకులు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, మేకప్ స్టోరేజీ కంటైనర్లు ఉన్నాయని చెబుతున్నారు.
నేటి బ్లష్లు, ఐషాడోలను పోలిన అలంకరణ వస్తువులు, వివిధ రకాల వర్ణద్రవ్యాలు పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ప్రారంభంలో, వారు ఎరుపు, గులాబీ రంగులలో వివిధ టోన్లలో మేకప్ మెటీరియల్స్ కనుగొన్నారు.
జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ 1970 మరియు 2011 మధ్య జరిపిన త్రవ్వకాల్లో అనేక ముఖ్యమైన కళాఖండాలు లభించాయి. పరిశోధకులు థియేటర్, స్టేడియం, పబ్లిక్ బాత్లు, వ్యాయామశాల, వంతెనలు, వ్యాపార భవనాలు, నెక్రోపోలిసెస్ మరియు పవిత్రమైన గుహ, మీటర్ స్టెయిన్ను కూడా గుర్తించారు.
మేకప్ వేసుకోవడం మహిళలకు పుట్టకతోనే వచ్చిన జమ్మహక్కు. ఈ కాలం మహిళలే కాదు.. అన్ని సంవత్సరాల క్రితమే మహిళలు మేకప్ వేసుకున్నారు. క్రేజీ కదా..! అప్పటి పద్ధతులు పరిణితి చెందుతూ.. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఇంకా అప్డేట్ అయ్యాయి.