తెలంగాణాలో మళ్ళీ గులాబీ జెండా ఎగరనుందా ?

-

నవంబర్ 30వ తేదీన తెలంగాణాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో గెలవడానికి BRS, కాంగ్రెస్, బీజేపీ మరియు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎంతో కసిగా ఎదురుచూస్తున్నాయి. ఎవరికీ వారు మేమంటే మేమె గెలుస్తాము అంటూ డప్పు కొట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఒక సర్వే ప్రకారం తెలంగాణాలో మరోసారి గులాబీ జెండా ప్రగతి భావం పై ఎగరనుంది అంటూ తెలిపింది. పూర్తి సమాచారం ప్రకారం డెమోక్రసీ టైమ్స్ నెట్ వర్క్ అనే ఒక సర్వే ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాల ప్రకారం రానున్న ఎన్నికలలో BRS పార్టీ పోటా పోటీగా సీట్లను గెలుచుకుని వరుసగా మూడవసారి అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం కేసీఆర్ సారధ్యంలోని BRS కు 67 సీట్లు దక్కుతాయని చెప్పింది. అదే విధంగా BRS కు గట్టి పోటీ ఇస్తుందని నమ్ముతున్న కాంగ్రెస్ కు కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. ఇక మాదే అధికారం అంటూ ఎగిరెగిరి పడుతున్న బీజేపీ 6 సీట్లు మాత్రమే దక్కించుకుంటుంది డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ తెలిపింది.

కాబట్టి ఈ సర్వే ప్రకారం చూస్తే మాత్రమే మళ్ళీ తెలంగాణాలో కేసీఆర్ సీఎంగా కావడం కంఫర్మ్ అని తెలుస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది మాత్రం ఎన్నికలు పూర్తి అయ్యే వరకు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news