కాంగ్రెస్​కు ఓటేస్తే.. ‘కర్ణాటక గతే.. రాష్ట్రంలో కరెంటు కటకటే’ : ఎమ్మెల్సీ కవిత

-

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. మరోవైపు హస్తం పార్టీ బస్సు యాత్రపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్​పై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా విరుచకుపడ్డారు.

మోసం కాంగ్రెస్ నైజాం అని.. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణకు కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని చెప్పారు. 20 గంటల పాటు కరెంటు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి ఇప్పుడు 5 గంటల కరెంట్ తో సరిపెట్టుకోండని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారని కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక మంత్రిలానే ఇక్కడ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కూడా 3 గంటల కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు ఇవ్వడం అనవసరమని అన్నారని గుర్తు చేశారు. ‘కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకు ? 5 గంటల… 3 గంటల పార్టీలు మనకొద్దు… దేశంలో ఉచితంగా 24 గంటల కరెంటు‌ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్​కే మద్దతుగా నిలుద్దాం.’ అంటూ కవిత ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news