WBBL-23:నరాలు తెగే ఉత్కంఠలో 2 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్స్ ఓటమి !

-

ఈ రోజు నుండి మొదలైన మహిళల బిగ్ బాస్ లీగ్ లో మొదటి మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ మరియు సిడ్నీ సిక్సర్స్ మధ్యన జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్టార్ నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్టార్స్ లో కెప్టెన్ మెగా లానింగ్ 55 పరుగులు చేసి జట్టుకు కీలక స్కోర్ ను సాధించిపెట్టింది. ఇక సిక్సర్స్ లో ఛీట్లే మరియు గార్డెనర్ లు తలో రెండు వికెట్లు సాధించారు. ఇక స్టార్స్ విసిరిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో సిక్సర్స్ మొదట్లో బాగా తడబడ్డారు. కేవలం 71 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి ఓటమికి బాటలు వేసుకుంది. స్టార్స్ బౌలర్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఏకపక్షముగా ముగుస్తుంది అని అనిపించింది. కానీ కెప్టెన్ గార్డెనర్ (72) మరియు మైట్లాన్ బ్రౌన్ (35) తో కలిసి 7వ వికెట్ కు 84 పరుగులు జోడించి జట్టును విజయపు అంచుల వరకు తీసుకువెళ్ళింది.

కానీ 19 ఓవర్లో అన్నాబెల్ సదర్లాండ్ గార్డెనర్ మరియు బ్రౌన్ లను అవుట్ చేసి స్టార్స్ కు 2 పరుగులు తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించింది. అటు బ్యాటింగ్ లో 34 పరుగులు ఇటు బౌలింగ్ లో వికెట్లు తీసిన సదర్లాండ్ కె ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news