జీవితంలో ఒక‌టే సారి ఓడిపోయా.. కానీ : సీఎం కేసీఆర్‌

-

జీవితంలో ఒక్క‌టే ఒక్క‌సారి ఓడిపోయాను.. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తూఫ్రాన్ ప‌రిధిలోని తూంకుంటలోని క‌న్వెన్ష‌న్ హాల్‌లో గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ నేత‌ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మీ అంద‌రి పుణ్యంతో గ‌జ్వేల్ ఎమ్మెల్యే అయ్యాను. జీవితంలో ఒక‌టే సారి ఓడిపోయాను. వాస్త‌వంగా గెలిచి ఓడిపోయాను అది. గెలిచిన కానీ వ‌య‌సు త‌క్కువ లొల్లి ఎక్కువ పెడుతుంటి. కానీ ఆలోచ‌న లేకుండే.

CM KCR Speech Highlights: నేను అబద్దాలు చెబితే టీఆర్‌ఎస్‌ను ఓడించండి,  లేదంటే ప్రతిపక్షాలను తరిమికొట్టండి, కృష్ణా-గోదావరి నీటితో నల్లగొండ జిల్లా  ...

అప్పుడు నా వ‌య‌సు 25 ఏండ్లు. అప్పుడు బ్యాలెట్ సిస్టం ఉంటుండే. ఎల‌క్ట్రానిక్ మేషిన్లు లేకుండే. ఓ ఐదారు వేల ఓట్లు నాకు వ‌చ్చిన‌వి దాంట్ల క‌లిపేసిండ్రు. క‌లిపేసి 700 ఓట్ల‌తోని ఓడిపోయిన‌ట్లు డిక్లేర్ చేసిండ్రు. రీ కౌంటింగ్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. హైకోర్టులో కేసు వేసినం అదంతా జ‌రిగింది. ఆ ఒక్క‌సారి ఓడించ‌బ‌డ్డ‌.. ఓడిపోలేదు నేను. ఆ త‌ర్వాత నేను వెన‌క్కి మ‌ళ్లీ చూడ‌లేదు.. గెలిచినాను. ఈ తెలంగాణ గ‌డ్డ ఎంత గొప్ప‌ది అంటే.. కేసీఆర్ తెలంగాణ వ‌స్త‌ది.. నీ మొండి త‌నమే తెస్త‌ది అని జ‌య‌శంక‌ర్ చెప్పారు. అనేక బాధ‌లు ప‌డ్డ పాల‌మూరు జిల్లాను మీ కండ్ల‌తోటి చూడాలి. మీరు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా నిల‌బ‌డాల‌ని చెప్పారు.

ఉమ్మడి పాలనలో మంజీరా నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాకపోయేవని, అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే ఒక్కో బాయికి రూ. 2 వేలు, మూడు వేలు వేసుకొని బాగుచేయించే పరిస్థితి ఉండేదని చెప్పారు కేసీఆర్. కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఆనాడు చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఇక లాభం లేదని చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని కేసీఆర్ గారు గుర్తు చేశారు. కొంతమంది తో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పోరాడి చివరకు తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో అభివృద్ధి చేసుకున్నామన్న ముఖ్యమంత్రి…, సాధించిన దానికే సంతృప్తిని చెంది ఆగిపోవద్దన్నారు. శ్రేష్టత కోసం తపన పడడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగిన నాడే గుణాత్మక జీవన విధానం ప్రజలకు అందించగలమని సిఎం తెలిపారు. ఈ పదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో మనందరం గమనించాల్సింది అదేనని సిఎం వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news