160 స్థానాలతో టీడీపీ – జనసేన అధికారంలోకి రాబోతున్నాం – అచ్చెన్నాయుడు

-

160 స్థానాలతో టీడీపీ – జనసేన అధికారంలోకి రాబోతున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మనకు తోడుగా జనసేన ఉంది….కరెక్ట్ టైంలో.. మంచి హృదయంతో టీడీపీతో పొత్తు ప్రకటించారని వెల్లడించారు. ఏదైనా జనసేనతో కలిసే వెళ్లాలని.. చంద్రబాబుకు మద్దతిచ్చిన పవనుకు టీడీపీ విస్తృత స్థాయీ సమావేశం కృతఙతలు తెలుపుతోందని పేర్కొన్నారు.

ఎల్లుండి జనసేనతో సమావేశం ఉంది.. భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. కరవు వల్ల రైతులు తెగ ఇబ్బంది పడుతున్నారని.. కరువుతో అల్లాడుతోన్న రైతులను పలకరిద్దాం.. ఎండిన పంటలను పరిశీలిద్దామని చెప్పారు. జనసేనతో కలిసి ఈ పోరాటం చేపడదామని.. 160 స్థానాలతో టీడీపీ – జనసేన అధికారంలోకి రాబోతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారు….టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు.. దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆగ్రహించారు. భర్త జైల్లో ఉంటే భార్య ఎంతో బాధపడుతుంది…నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news