LIVE UPDATES: “పాకిస్తాన్ వెన్నువిరిచిన సఫారీ స్పిన్నర్ షంశి”

-

వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ప్రత్యర్థులను తమ ప్రదర్శనలతో వణికిస్తూ విజయాలను దక్కించుకుంటోంది. తాజాగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లోనూ సౌత్ ఆఫ్రికా బౌలర్లు తక్కువ స్కోర్ ను కట్టడి చేసి బ్యాట్స్మన్ పని సులువు చేశారు. పాక్ బ్యాటింగ్ లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. బ్యాటింగ్ లో బాబర్ అజాం (50), షకీల్ (52) మరియు షాదాబ్ ఖాన్ (43) లు రాణించారు. ఇక ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్, ఇఫ్తికార్ అహమద్, రిజ్వాన్ లు ఫెయిల్ అయ్యారు. పాకిస్తాన్ ను మొదటగా జాన్సెన్ రెండు వికెట్లు తీసి డౌన్ చేయగా, ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రమాదకరంగా మారుతున్న దశలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శంశి రాణించి ఫామ్ లో ఉన్న షకీల్ ను అవుట్ చేసి మళ్ళీ సౌత్ ఆఫ్రికా ను గేమ్ లోకి తీసుకువచ్చాడు.

ఓవరాల్ గా శంశి ఈ మ్యాచ్ లో పది ఓవర్లు బౌల్ చేసి 60 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇతను తీసిన వికెట్లతో బాబర్ అజాం, ఇఫ్తికార్ అహ్మద్, శంశి మరియయు ఆఫ్రిది లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news