అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదు : తమ్మినేని

-

అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదన్నారు తమ్మినేని వీరభద్రం. హైదరాబాదులో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. తాము అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదని తమ్మినేని వీరభద్రం తేల్చిచెప్పారు. ఎల్లుండి మరోసారి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం బేటీ కానుంది.

Thammineni-Veea-bhadram

ఆ సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు తమ్మినేని ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక అటు జైల్లో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని నిన్న మూలాఖత్ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ తో చంద్రబాబు చెప్పారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నేతలకు వివరించాలని ఆయన సూచించారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news