ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న కేసీఆర్ నిజ స్వరూపం ఇదే : ఖర్గే

-

 

ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి తప్పిన విషయం మొత్తం తెలంగాణ ప్రజలకే తెలుసన్నారు. కానీ సోనియాగాంధీ మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సమాధి అవుతున్నా వెనక్కి తగ్గలేదని, తన మాటను నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫైవ్ గ్యారంటీస్‌ అమలవుతున్నాయని, తెలంగాణ ప్రజలను మధ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు అనుమానాలు రేకెత్తిస్తున్నారని, సందేహాలుంటే వచ్చి చూసుకోవచ్చని, ప్రజలను అడిగి తెలుసుకోవచ్చన్నారు.

Congress On Mallikarjun Kharge's 1-Year As Party Chief

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియాగాంధీ కాళ్ళు మొక్కిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆమెతో కలిసి గ్రూపు ఫోటో దిగారని, అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆమెపైనా, వారి కుటుంబ సభ్యులైన రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను విమర్శిస్తున్నారని, చివరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, కేసీఆర్ నిజ స్వరూపం ఇదేనని ఖర్గే చురకలంటించారు. రాష్ట్రం ఏర్పడేటప్పుడు మిగులు బడ్జెట్ ఉంటే తొమ్మిదేళ్ళలో అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్‌ పరిపాలనీ తీరును విమర్శించారు.

‘‘కర్ణాటకకు తీసుకెళ్లడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ రావాలా… ఫామ్ హౌజ్ రావాలా కేసీఆర్.. చెప్పు.. ఇదే మీకు మా సవాల్. పోతూ పోతూ మేడిగడ్డ మీదుగా పొయ్యి.. నువ్వు కట్టిన నాణ్యతలేని ప్రాజెక్ట్ చూసుకుంటా పోదాం. పనిమంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. మేడిగడ్డ పరిస్థితి అట్లుంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైలో వేసి చిప్ప కూడు తినిపించాలి’’ అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే నాయకుడు జగ్గారెడ్డిని గెలిపించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖర్గే ఇక్కడకు వచ్చారని అన్నారు. జగ్గన్నను 50 వేల మెజారిటీతో గెలిపించాలని, ఆయన రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నారని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news