బీఆర్ఎస్ లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీలో టికెట్ దక్కని వారు కాంగ్రెస్, బీజేపీ లలో చేరుతుండగా.. మరికొందరూ కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేశారు. తాజాగా కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వీరితో పాటు వీరి అనుచరులకు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నాగం జనార్థన్ రెడ్డి, విష్ణు వర్థన్ రెడ్డి, జైపాల్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు. ఈసారి పాలమూరులో 14కి 14 సీట్లు గెలిచేందుకు నాగం జనార్ధన్ రెడ్డి కృషి చేయాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండి.. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం కోసం ప్రయత్నించాలని తెలిపారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news