ఉస్మానియా విద్యార్థులు అడ్డా మీద కూలీ లాంటోల్లు – రేవంత్ రెడ్డి

-

ఉస్మానియా విద్యార్థులపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిలు అడ్డా మీద కూలీల లాంటివారు అని ఆగ్రహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీర్లు, బిర్యానీలు తిని.. తిన్నది అరిగే దాకా మాట్లాడే అడ్డా మీద కూలీ లాంటోల్లు అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇపుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా కొల్లాపూర్ లో నిన్న జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున కొల్లాపూర్ లో సభ జరుపుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే తెలంగాణ ప్రజల ఆస్తిని ఆయన బంధువులకు దోచి పెడతారన్నారు. 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే బాధ్యత పాలమూరు బిడ్డ మీద కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిందని, అందుకనే ఈ జిల్లాలో మీరు కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. చస్తే ఇక్కడి మట్టిలో కలిసే వాడనని, అందుకే ఆదరించండి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఆరు గ్యారంటీలను డిసెంబరు 9న అమలు చేస్తామని చెప్పారు. దుబ్బాకలో దాడి చేసింది కాంగ్రెస్ వాళ్లంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news