మల్కాజ్ గిరి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా : మంత్రి హరీశ్ రావు

-

మైనంపల్లి హనుమంత్ రావు పై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. తన స్వార్థం కోసమే మైనంపల్లి పార్టీ మారారని తెలిపారు. తండ్రి, కుమారుడు ఇద్దరూ మల్కాజ్ గిరి, మెదక్ రెండు చోట్ల ఓడిపోవడం ఖాయమన్నారు. 28 రోజులు కష్టపడి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి. నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకొని అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను. ఈసారి కూడా బీఆర్ఎస్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓడిపోతే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇక్కడ ఎన్నికలు మనసున్న మనిషి మాటలు, ముఠాల మనిషికి మధ్య పోటీ అన్నారు. ఏ సర్వే చూసిన బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెబుతున్నాయని చెప్పారు. భూమికి బరువైన పంట పండుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రైతు భీమాతో వ్యవసాయం పండగ అయిందని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతుల వద్ద డబ్బులు తీసుకున్నాయని.. ఈ ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ రిజెక్టేడ్ నాయకులు పోటీ చేస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news