వద్దయ్యా అంటే పచ్చ జొన్నలు పండిస్తరు : కేసీఆర్

-

నష్టం వచ్చినా వరి ధాన్యం కొంటున్నామని బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తెలిపారు. మక్కలు, జొన్నలు కూడా కొనాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. బాల్కొండ ప్రాంతంలో వద్దయ్యా అంటే పచ్చ జొన్నలు పండిస్తున్నారు. ఇప్పుడు ఎవ్వడు తింటడు అవి.. అయినా వాటిని కొనే పని పెట్టుకున్నాం. ఎందుకు అంటే నేను కూడా కాపోడినే.. రైతునే. అన్నదాతల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే రైతుబంధు ఇస్తున్నామని వివరించారు కేసీఆర్.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ వస్తుంది. ఆ పార్టీ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏకబిగిన 50 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్లు చేసిననాడు మనం చూడలేదు. ఇవాళ కాంగ్రెస్‌ మాట్లాడుతున్నది ఒక్క ఛాన్స్‌ అంటున్నది. మీకు 11 సార్లు ఛాన్స్‌లు ఇచ్చారు. ఒక్కసారి ఛాన్స్‌ ఇస్తే పంటికంటకుండా మింగుతరా? ఏం కారణం? అని ఆలోచన చేయాలి. వైఖరేంటో గమనించాలి. ఏం మాట్లాడుతున్నారు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోన చేయాలి. అప్పుడే నిజానిజాలు తేలుతయ్‌. బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news