దళిత బంధు నా మానసపుత్రిక.. అమలు చేస్తాం : కేసీఆర్

-

దళితబంధు నా మానసపుత్రిక అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ దళిత బంధు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మరోసారి గెలిపిస్తే ధర్మపురి నియోజకవర్గం అంతా దళితబంధు అమలు చేస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. దళిత సమాజం అణిచివేయబడిందని.. అంటరానితనం అనే వివక్షకు గురైందన్నారు. నెహ్రుగారి నుంచే వీరి సంక్షేమం పెట్టి ఉంటే దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. దళిత బంధు అనే స్కీమ్ పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు కేసీఆర్.

దళిత సమాజాన్ని ఉద్దరించాలన్నదే మా లక్ష్యం. మరోవైపు గోదావ‌రి పుష్క‌రాలు అంటే రాజ‌మండ్రి, కృష్ణా పుష్క‌రాలు అంటే చ‌క్క‌గా విజ‌య‌వాడ‌.. అక్క‌డ‌కు పోవాలి. గుండు కొట్టించుకోవాలి. జేబులు ఖాళీ చేయాలి. మ‌నం రావాలి. త‌ర్వాత నేను డిమాండ్ చేసి ప్ర‌తిజ్ఞ చేశాను. ధర్మపురిలో జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌డితే ఆ ఏడాదే ఇక్కడ గొప్పగా జ‌రిగాయి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత చాలా ఘ‌నంగా గోదావ‌రి పుష్క‌రాలు నిర్వ‌హించుకున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news