దిల్లీని దుప్పటిలా కప్పిన పొగమంచు.. గాలి నాణ్యత క్షీణించడంతో ప్రజల ఇబ్బందులు

-

దేశ రాజధాని దిల్లీలో వాయునాణ్యత రోజురోజుకు భారీగా క్షీణిస్తోంది. చాలా ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు అలుముకోవడంతో రోడ్లు, భవనాలు కంటికి కనిపించకుండా పోయాయి. మహానగరంలోని పలు ప్రాంతాల్లో వాయునాణ్యత సూచీ 400 దాటి ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో యాంటి- స్మోగ్‌ గన్‌లతో అధికారులు నీటి తుంపరను చల్లి.. పొగ మంచును తగ్గించే చర్యలు చేపట్టారు. మరోవైపు వాయు నాణ్యత క్షీణించడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు.

మరోవైపు పంజాబీ బాఘ్‌, బవానా, ముండ్కా ప్రాంతాల్లో వాయునాణ్యత భారీగా పడిపోయింది. దిల్లీ పరిసర ప్రాంతాలైన గజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న 2 వారాల్లో దిల్లీలో భారీగా వాయుకాలుష్యం పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్న పిల్లలకు అస్తమా, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో జాగ్రత్త వహించాలని పౌరులకు సూచించారు. నగరంలో నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news