ఏపీ వాసులకు శుభవార్త.. 7న రైతు భరోసా, 28న విద్యా దీవెన

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది జగన్‌ సర్కార్‌. 7న రైతు భరోసా, 28న విద్యా దీవెన విడుదల చేస్తామని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఈనెల 20 తర్వాత కులగణన చేపడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు.

RYTHU BAROSA on nov 7th

నిన్న కేబినెట్ బేటి అనంతరం మాట్లాడుతూ…’ఈనెల 7న రైతు భరోసా సహాయం చేస్తాం. 15న నిరుపేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, 22A జాబితా నుంచి ఈ నామ్ భూముల మినహాయింపు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి రుణాల మాఫీ చేస్తాం. 28న జగనన్న విద్యా దీవెన, 30న కళ్యాణమస్తు, శాదీ తోఫా అందజేస్తాం’ అని తెలియజేశారు.

రిషికొండపై ఏర్పాటు చేస్తున్నది ముఖ్యమంత్రి పర్యటన సమయంలో తాత్కాలిక విడిది అని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు. రాజకీయ కారణాలతోనే కొంత మంది సుప్రీంకోర్టు వరకు వెళ్లారని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అందుకే సుప్రీంకోర్టు పిటిషన్ ను తిరస్కరించిందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news