ఏపీలో మరో రెండు సూపర్ స్పెషాలిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. చిన్నారుల కోసం విజయవాడ, విశాఖపట్నంలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తిరుపతిలో రూ. 450 కోట్లతో పిడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తుండగా…. ఈ తరహాలోని 500 పడకల ఆస్పత్రులను ఈ రెండు చోట్ల నిర్మించనుంది. వీటిల్లో గుండె, కిడ్నీ, మెదడు, కాలేయం, క్యాన్సర్ సహా అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక అటు వీఆర్‌వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విఆర్వోల కోసం ప్రత్యేక జీవోలు తీసుకువచ్చింది జగన్ సర్కార్. విఆర్వోల కోసం ప్రభుత్వం 154,64,6538,166,31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు తెలిపారు. వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.