విరాట్ కోహ్లీ సెల్ఫిష్..పాక్ మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

-

విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్ పై పాక్ మాజీ కెప్టెన్ హఫీజ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘సౌత్ ఆఫ్రికాతో కోహ్లీ బ్యాటింగ్ చూస్తే వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్ లో ఇలా ఆడటం మూడోసారి.

Mohammad Hafeez calls Virat Kohli selfish after 49th hundred, fans tear into former Pakistan batter

దక్షిణాఫ్రికాతో 49వ ఓవర్ లో సింగిల్ తీసి సెంచరీ కోసం చూశారు తప్ప… జట్టు ప్రయోజనాల కోణంలో ఆలోచించలేదు’ అని ధ్వజమెత్తారు. ఆ మ్యాచ్ లో కోహ్లీ 121 బంతుల్లో 101* పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా..  టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రత్యేకంగా సత్కరించింది. ‘హ్యాపీ బర్త్డే విరాట్’ అని రాసిన బంగారు పూత బ్యాట్ ను CAB ప్రెసిడెంట్ స్నేహశిశ్ గంగూలి కోహ్లీకి బహుకరించారు. అలాగే ‘వయస్సు కేవలం ఒక సంఖ్య. దీనికి సజీవ సాక్ష్యం మీరే’ అన్న అక్షరాలను కూడా బ్యాట్ పై ముద్రించారు.

Read more RELATED
Recommended to you

Latest news