BRS పార్టీలో చేరనున్న అద్దంకి దయాకర్ ?

-

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌ తగిలనుందా..? ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఉద్యమకారుడు పార్టీని వీడబోతున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ లో పార్టీలో చేరనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుకు మద్దతుగా వారి గెలుపు కోసం అద్దంకి దయాకర్… ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Adnaki Dayakar to join BRS party

అయితే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్వయంగా కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ నాకు టికెట్ ఇస్తుంది అని నమ్మకం ఉందని… పీసీసీ రేవంత్‌ రెడ్డి నాకు టికెట్ ఇప్పించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొందరు నేను పార్టీ వీడుతున్న అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు అద్దంకి దయాకర్. ఇలాంటి దివాళా కోరు రాజకీయాలు మానుకోవాలని కోరారు. కొందరు.. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు…పార్టీ..కార్యకర్తలు..ప్రచారం నమ్మకండన్నారు. కాగా.. అద్దంకి దయాకర్.. తుంగతుర్తి టికెట్‌ ఆశిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news