తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందొద్దు : మంత్రి కేటీఆర్

-

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ర్యాలీలో ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ బయలుదేరుతుండగా.. కేటీఆర్, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ తరుణంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కిందపడిపోయారు. సడన్ బ్రేక్ వేయడంతో వ్యాన్ రెయిలింగ్ ఊడిపోయింది. అప్రమత్తమైన కేటీఆర్ భద్రత సిబ్బంది ఆయనను పట్టుకున్నారు.

ఈ ప్రమాదంలో కేటీఆర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆర్మూర్ రోడ్ షోలో చిన్న ఆపశృతి చోటు చేసుకుంది. రోడ్ షో సందర్భంగా వాహనానికి బ్రేక్ వేయడంతో రేయిలింగ్ విరిగిపోయిందని.. వాహనం పైనుంచి కిందికి జారినట్టు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లినట్టు వెల్లడించారు మంత్రి కేటీఆర్.తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news