ఎవరెన్ని దండాలు పెట్టినా.. మళ్లీ బీఆర్ఎస్ దే విజయం : కేటీఆర్

-

ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని సార్లు దండం పెట్టినా.. మళ్లీ బీఆర్ఎస్ దే ఘన విజయం అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కన్నారు.రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ వ్యాసాల సంకలనం దారి చూపిన దశాబ్ది పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల రాష్ట్ర ప్రగతి దేశం పాలనా చరిత్రలో నూతన అధ్యాయం అని పేర్కన్నారు.

సాగు, సంక్షేమ, పారిశ్రామిక రంగాల్లో కేసీఆర్ అమలు చేసిన విధానాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయన్నారు. దేశంలో ఒకటో, రెండో రంగాల్లో మిశ్రమ ఫలితాలకే విప్లవం, హరిత విప్లవమని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పురోగతిని ఎత్తి పట్టడంతో పాటు.. బీజేపీ, కాంగ్రెస్ ల అమానవీయ రాజకీయ నైజాన్ని బహిర్గతం చేస్తున్న ఆంజనేయ గౌడ్ కృషి ప్రశంసనీయమన్నారు. ఆలోచన పరులు కీలకమైన ఎన్నికల సందర్భంగా క్రియాశీల పాత్ర పోషించి.. బీఆర్ఎస్ గెలుపులో భావవ్యాప్తికి సారద్యం వహించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news