కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయడం పై సీఎం కేసీఆర్ స్పందించారు. కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు గిట్లనే నన్ను అర్రతిప్పలు పెట్టిండ్రు.. కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి ఎడ్డం అంటే తెడ్డెం అని.. అవునంటే కాదని.. ఎన్ని రకాల గోసలు పెట్టాలో అన్ని పెట్టిండ్రు. చివరకు నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ శవయాత్రనా? తెలంగా జైత్రయాత్రనా అని బయల్దేరితే.. ఎక్కడికక్కడ మీరు నరసింహులై లేస్తే.. ఊర్లన్ని ఉద్యమాలైతే.. సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారు.
ఇక వెంటనే ఇచ్చిండ్రా అంటే మల్ల ఏడాదిన్నర ఎగవెట్టిండ్రు. సకల జనుల సమ్మె అని యావన్మంది ఉద్యోగులు, ప్రజలు, రైతులు మొత్తం రోడ్ల మీదకు వచ్చి కొట్లాడితే.. చివరకు తెలంగాణల నూకలు పుట్టకుండా అయితయని అప్పుడు ముందుకొచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన తెలంగాణను కూడా బతకనీయొద్దు.. దీన్ని ముందల పడనీయద్దు.. రాజకీయ అస్థిరత తేవాలని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతో పట్టుబడ్డడో.. ఇప్పుడు ఆ మహాత్ముడే కామారెడ్డిలో నామీద పోటికొస్తడంట. ఎవరికి ఏం బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయం చేయాలని చెప్పారు సీఎం కేసీఆర్.