మగువలకు గుడ్ న్యూస్..వరుసగా 4వ రోజు తగ్గిన బంగారం ధరలు

-

 

Gold Rates : మగువలకు గుడ్ న్యూస్.. వరుసగా 4వ రోజు బంగారం ధరలు తగ్గిపోయాయి. గడిచిన మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు… ఇవాళ కూడా తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates
gold and silver rates

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గి, రూ. 60, 760 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి, రూ. 55, 700 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 300 తగ్గి రూ. 76, 200 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news