కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు : కిషన్‌ రెడ్డి

-

సీఎం కేసీఆర్‌పై మరోసారి కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శులు చేశారు. గజ్వేల్‌లో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తాననగానే కేసీఆర్ భయపడ్డారని అన్నారు. ఈటల రాజేందర్‌కు భయపడే కేసీఆర్ గజ్వేల్ నుండి కామారెడ్డికి పారిపోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఈ సారి గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌తో పాటు ఆయన కొడుకు కేటీఆర్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని.. గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో అభ్యర్థులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

Kishan Reddy tells people to hoist tri-colour atop houses on Aug 15

బీజేపీ తరఫున 39 మంది బీసీలు బరిలో ఉన్నారని, కానీ కాంగ్రెస్ నుంచి 22 మంది బీసీలు, బీఆర్ఎస్ నుంచి 23 మంది బీసీలు మాత్రమే పోటీ చేస్తున్నారన్నారు. బీసీల గురించి ఆలోచించేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. అందుకే కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయారన్నారు. కేసీఆర్ రెండుచోట్లా ఓడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారన్నారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి గెలిపించాలని చూస్తోందని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news