బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది : అద్దంకి దయాకర్‌

-

తనతో సహా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోని నేతలమందరం కలిసి… పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఆయన తుంగతుర్తి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ మరొకరికి టిక్కెట్ కేటాయించింది. అయినప్పటికీ అద్దంకి దయాకర్ స్పోర్టివ్‌గా స్పందిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… తనకు టికెట్ రాలేదని చాలామంది ఫోన్ చేశారని, తనకు టికెట్ రాకున్నా, పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. పార్టీలో మాల, మాదిగలు అన్నదమ్ములలా ఉంటామన్నారు.

congress shock to addanki dayakar | Vaartha

‘‘2014లో నేను కాంగ్రెస్‌లో చేరిన నెల రోజులకే నాకు టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేస్తా. టికెట్ రాని నేతలంతా కలిసి 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయి కారి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ మీటింగ్‌లకు లేని నిబంధనలు కాంగ్రెస్‌కే ఎందుకు?. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. హాంగ్ కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది’’ అంటూ అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు చేశారు.‘

 

 

Read more RELATED
Recommended to you

Latest news