వరల్డ్ కప్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎంత పేలవంగా ఆడిందో అందరూ చూశారు. ఈ వైఫల్యంతో పాకిస్తాన్ క్రికెట్ లో పెద్ద ఎత్తున విమర్శలు లోలోపలే మొదలయ్యాయి. ఈ ప్రభావంతో పాకిస్తాన్ క్రికెట్ లో చీఫ్ సెలెక్టర్, డైరెక్టర్, బౌలింగ్ కోచ్ ఇలా ముఖ్యమైన పదవులలో ఉన్న వారంతా రాజీనామాలు చేయడంతో కొత్త టీం తయారవుతోంది. అందులో భాగంగా ఇప్పటికే టీం డైరెక్టర్ గా మాజీ పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ను ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయాన్ని పాకిస్తాన్ టీం యాజమాన్యం తీసుకుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ కొత్త చీఫ్ సెలెక్టర్ గా మాజీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ ను తీసుకుంది. ఇతను ఈ సంవత్సరం ఆగష్టు లోనే రిటైర్ అయ్యాడు, ఇక యంగ్ ప్లేయర్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఇతనికి పాకిస్తాన్ యాజమాన్యం అవకాశం ఇచ్చింది.
మరి ముందు ముందు పాకిస్తాన్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి ప్లేయర్లను ఎంపిక చేసి విజయాలను అందిస్తారో అన్నది చూడాలి.