మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ అయ్యింది. మంత్రి రాథోడ్‌పై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171-ఈ,171-హెచ్ ఐపీసీ ఆర్/డబ్ల్యూ 188 ఐఓసీ సెక్షన్ల కింద గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు మండలంలోని కొంగరగిద్దె గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా గూడూరు పీఎస్ లో ఎఫ్ఎస్ టీ టీమ్స్ మంత్రి సత్యవతిపై ఫిర్యాదు చేశాయి. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ మంత్రి సత్యవతి రాథోడ్ పై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున మంత్రి సత్యవతి ప్రచారం చేస్తున్నారు. కొంగరగిద్దలో ప్రచారానికి వెళ్లిన మంత్రి వెళ్లారు. సత్యవతి రాథోడ్ కు మంగళ హారతితో బీఆర్ఎస్ మహిళలు స్వాగతం పలికారు. మంగళహారతి పళ్లెంలో రూ.4వేలను మంత్రి సత్యవతి రాథోడ్ వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్‌టీ బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది.