అజారుద్దీన్ గొప్ప క్రికెటర్, కానీ గొప్పనేత కాదు: కేటీఆర్

-

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఇండియా కెప్టెన్ అజారుద్దీన్ జూబిలీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆఖరి నిముషంలో అజారుద్దీన్ కు కాంగ్రెస్ సీటును ఇవ్వడంతో అభ్యర్థిగా నిలిచాడు. కాగా తాజాగా మంత్రి కేటీఆర్ అజారుద్దీన్ పై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. జూబిలీ హిల్స్ లో పోటీ చేస్తున్న అజారుద్దీన్ గొప్ప క్రికెటర్ ఆయనంటే నాకు చాలా ఇష్టం, కానీ పొలిటికల్ గా మాత్రం గొప్ప నేత కాదంటూ కేటీఆర్ విమర్శించాడు. నిజానికి అజారుద్దీన్ కు జూబిలీహిల్స్ లోని కాలనీలు మరియు బస్తీలు ఎక్కడఉన్నాయో కూడా తెలియవు అంటూ కామెంట్ చేశాడు కేటీఆర్. ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ గతంలో ఇదే విధంగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లి మొరాదాబాద్ లో పోటీ చేశాడు, అక్కడ ప్రజలు ఇతన్ని తిరక్షించారు.

ఇప్పుడు జూబిలీ హిల్స్ లోనూ జరిగేది అదే అంటూ చెప్పారు. మరి జూబిలీ హిల్స్ లో కాంగ్రెస్ BRS లలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news