మైనంపల్లి రోహిత్‌కు గుడికి, బడికి తెలియదు : పద్మా దేవేందర్‌రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌కు మెదక్‌ నియోజకవర్గ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదని భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాపన్నపేట మండలం ఎల్లాపూర్, యుసుపేట గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె మైనంపల్లి రోహిత్‌కు గుడికి, బడికి తేడా తెలియదని విమర్శలు గుప్పించారు.

MLA Padma Devender reddy | సీఎం కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారు : ఎమ్మెల్యే  పద్మాదేవేందర్‌ రెడ్డి-Namasthe Telangana

ఈ సందర్భంగా మాట్లాడుతూ… మైనంపల్లి రోహిత్‌కు మెదక్ నియోజకవర్గ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. రోజుకు ఇరవై నాలుగు గంటలే ఉంటుందని, కానీ రోహిత్ మాత్రం 25 గంటలు విద్యుత్ ఇస్తానని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. రోజుకు ఎన్ని గంటలు ఉంటాయో కూడా ఆయనకు తెలియదన్నారు. ఇరవై నాలుగు గంటల విద్యుత్ మేమే ఇస్తుంటే ఇక మీరు ఇవ్వడం ఏమిటన్నారు. ఏం తెలియకుండానే మెదక్‌కు వచ్చి ఏదో చేస్తానని చెబుతున్నాడని, అసలు ఇక్కడ ఏవి ఎన్ని ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు.

ఒక్క సారి అవకాశం ఇవ్వండి…అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం అని కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఓటర్లను కోరారు. మెదక్ పట్టణంలోని ఐదవ వార్డుతో పాటు పలు వార్డుల్లో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే పద్మకు పదేళ్ల పాటు అవకాశం ఇస్తే మెదక్ అభివృద్ధినీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. మినీ ట్యాంక్ పేరు చెప్పి పదేళ్లుగా నిర్మాణం సాగిస్తున్నారని, కానీ ఇంకా పదేళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. జిల్లా కేంద్రం, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు తెచ్చామని చెబుతున్నారే తప్ప, ఇతర అభివృద్ధి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే మెదక్‌కు వచ్చిన నిధులు అన్ని సిద్దిపేట తరలి పోతే ఇక్కడ ఎలా అభివృద్ది జరుగుతుందని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news