ఆనాడు కానిది ఇవాళ ఎలా సాధ్యం అయింది : కేసీఆర్

-

కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు. కాంగ్రెస్ నేతలు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యమా..? తోక మట్టనా..? ఇందిరమ్మ రాజ్యంలో కూడా తెలంగాణ వెనుకబడిన ప్రాంతమేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు కొల్లాపూర్ లో 1లక్ష 25వేల ఎకరాల్లో వడ్లు పండుతున్నాయి. ఇవాళ నీళ్లు ఎలా వచ్చాయి. మంత్రం వేస్తే వచ్చాయా.. 58 ఏళ్లు ఉన్న నాడు ఏం చేయలేదు.. ఇఫ్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ఏం చేసింది ఈ కాంగ్రెస్‌ పార్టీ. ఆ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు ? ఆ నాడు చేసింది చాలాక మళ్లీ కాంగ్రెస్‌ నాయకులు సిగ్గులేకుండా చెబుతున్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే ? మనం చూడలేదా? ఎన్టీ రామారావు పార్టీ రెండురూపాయలకు కిలోబియ్యం ఇచ్చేదాక ఆకలి బతుకులే కదా? ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులు. అంత ఎండి సచ్చినం. ఎవ్వడు ఆదుకున్నోడు లేడు. పేదల బాధలు పట్టించుకున్నోడు లేడు. పేదలకడుపు నింపాలన్న సోయి లేదు. రైతుల పొలాలకు నీరిచ్చే సోయి లేదు. ఏదీ చేయలేద అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news