అధికారంలోకి రాకముందే కాంగ్రెస్‌ రైతుబంధును ఆపింది.. ఇక గెలిస్తే : కేటీఆర్

-

అధికారంలోకి రాకముందే కాంగ్రెస్‌ పార్టీ రైతుబంధును ఆపిందంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక వాళ్లకు అవకాశం ఇస్తే ఏం చేస్తారో ఊహించలేమని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే.. ఎవరికీ న్యాయం జరగదని.. కేసీఆర్ మూడోసారి గెలిస్తే.. కొత్త పథకాలు తీసుకవస్తామని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా వెల్గటూరులో కేటీఆర్‌ రోడ్డు షో నిర్వహించారు.

“సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలో నెలకు రూ.3 వేలు వేస్తాం. ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్‌కు మొక్కాలని 2014లో మోదీ అన్నారు. గెలిచిన మోదీ రూ.400 గ్యాస్‌ సిలిండర్‌ను రూ.1200కు పెంచారు. కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తే.. రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. కరెంట్‌ కావాలో… కాంగ్రెస్‌ కావాలో ఆలోచించాలి. 1956లో పొరపాటు చేసినందుకు 50 ఏళ్లు బాధపడ్డాం. ఇప్పటికే 11 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్‌.. 12వ సారి కూడా ఇస్తారు. ధర్మపురి నియోజకవర్గంలో ఎస్సీలందరికీ రైతుబంధు ఇస్తాం. భారాసపై గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news