మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కే.సమ్మయ్య పై వేటుపడింది. ఎన్నికల నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినందుకు గాను కమిషనర్ ను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బాధావత్ సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 8న బెల్లంపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు ఎన్నికల నిబంధన ఉల్లంఘిస్తూ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఏర్పాట్లు చేశారు.
ఈ విషయాన్ని దిశ దినపత్రిక ఈనెల 11న యదేచ్చగా ఎన్నికల నిబంధన అనే శీర్షికతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్పందించారు. ఆయనపై జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి చర్యలు తీసుకున్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను బెల్లంపల్లి నుంచి బదిలీ చేశారు. హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ గా రెవెన్యూ అధికారి భుజంగంకు అదనపు బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగించారు.